Login to BATA
Please fill the below credientials
హరినాథ్ చికోటిబాటా ఆద్యక్షుడు
ప్రతిష్టాత్మకమైన మన 'బాటా' సంస్థ అధ్యక్ష హోదాను కల్పించినందుకు ముందుగా మీ అందరికీ నా ధన్యవాదములు. నిబద్ధత కలిగిన మన కమిటీ సభ్యుల సూచనలతో, మీ అందరి సహాయ సహకారములతో ఘనమైన తెలుగుభాషా సంస్కృతులను - మనం చేపట్టబోయే సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమముల ద్వారా ప్రపంచానికి తెలియచేయటంలో విజయం సాధించగలమనే పూర్తి నమ్మకం నాకు ఉన్నది. బాటా 44 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నదంటే అందుకు కారణం బే ఏరియాలో ఉన్న మన తెలుగువారు అందిస్తున్న సహాయసహకారాలతో పాటు పంచుతున్న ప్రేమాభిమానాలే కారణమని నేను విశ్వసిస్తున్నాను. బే ఏరియాలో నివసిస్తున్న వేలాది మంది తెలుగువారి ఆదరణ వల్ల ఈ రోజు మన సంస్థ అమెరికాలో ఉన్న ప్రముఖ కమ్యూనిటీ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిందని తెలియజేయటానికి సంతోషంగా ఉన్నది. ఈ శుభసందర్భంగా మీకు నేను మూడు ముఖ్యమైన విషయాలను విన్నపించదలచుకున్నాను.
'బాటా' సంస్థ లక్ష్యాలు ఉద్దేశ్యాలు గురించి తెలుసుకోవటం కోసం www.bata.org/about-us-details.htmlసైట్ కు లాగిన్ అవ్వండి. బాటా అభివృద్ధికి సంబంధించి మీ సూచనలను info@bata.org అనే ఈ-మెయిల్ కి పంపండి.
భవదీయుడు హరినాథ్ చికోటి